7వ వార్డులో పారిశుధ్య పనులు
02-03-2026 12:16 AM
కోదాడ, మార్చి 1 : పట్టణంలోని 7వ వార్డులో సమస్యల పరిష్కారం కోసం యువ కౌన్సిలర్ మాళోతు చైతన్య నాయక్ దృష్టి సారించారు. ఆదివారం కాలువకు ఇరువైపులా పేరుకపోయిన కంపచెట్లు, వ్యర్ధాల తొలగింపు పనులు చేపట్టారు.
డ్రైనేజీల పూడికతీత పనులను దగ్గరుండి చేయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాళోతు చైతన్య నాయక్ మాట్లాడుతూ వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వార్డు ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.




