25 May, 2026 | 10:50 PM

ఈ నెల 27న మంథనిలో రైతు గోస బీజేపీ భరోసా

25-05-2026 09:42 PM

మంథనిలో రాష్ట్ర బిజెపి బృందం పర్యటన విజయవంతం చేయాలి

మంథనిలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి

మంథని,(విజయక్రాంతి): ఈ నెల 27న రైతు గోస బీజేపీ భరోసా మంథని లో  రాష్ట్ర బిజెపి బృందం పర్యటన విజయవంతం చేయాలని సోమవారం మంథని లో బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి రైతులను కోరారు. మే 27న మంథనిలో పర్యటించబోయే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం బస్సుయాత్ర తో రైతు గోస బిజెపి భరోసా అనే పేరుతో ఈ కార్యక్రమం జరగబోతుంది, మంత్రి నియోజకవర్గం లోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన కోరారు. 

మంథని వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన సంజీవరెడ్డి 

 ముందస్తుగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి మంథని వ్యవసాయ మార్కెట్ ను సందర్శించారు. రైతులు నెల రోజులుగా ధాన్యాన్ని మార్కెట్లోకి తీసుకొస్తే నత్త నడకన ధాన్యం కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ఈ కొనుగోలు లో కూడా ప్రతి బస్తాకు మూడు కిలోల చొప్పున క్వింటాలకు 6 కిలోలు అదనంగా తూకం వేస్తూ అటు అధికారులు ఇటు రైస్ మిల్లర్లు రైతు నడ్డి విరుస్తుంటే మంత్రి శ్రీధర్ బాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రేడింగ్ పేరిట అదనపు తూకం వేస్తూ రైతును నట్టేట కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతుందని విమర్శించారు. ఎద్దేడిసిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రబిజెపి అధ్యక్షుడు ఎమ్మెల్యేలు ఎంపీలు  బృందం కాటారం మీదుగా మంథనిలో పర్యటించి అనంతరం పెద్ద పెల్లికి యాత్ర కొనసాగిస్తారని, ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గంలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టేముక్కుల సురేష్ రెడ్డి, నాయకులు కొండపాక సత్య ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ యాదవ్, జిల్లా కార్యదర్శులు బిరుదు గట్టయ్య, శివంగాని సతీష్, పట్టణ అధ్యక్షులు సబ్బని సంతోష్, సీనియర్ నాయకులు బోయిని నారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్,  ఎడ్ల సాగర్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రేపాక శంకర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్క సదానందం, మైనార్టీ మహోత్సవ అధ్యక్షులు చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.