14 March, 2026 | 5:56 PM

పల్లెల్లో సంక్రాంతి సందడి

15-01-2026 01:02 AM

జనసంద్రంగా ప్రధాన రహదారులు, కూడళ్లు

ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ ల కిటకిట 

గ్రామాలకు చేరిన పట్టణవాసులు

వాకిట్లో రంగవల్లులు, రైతన్నల లోగిళ్లలో ధాన్యపురాశులు

సందడిగా పల్లెలు

మణుగూరు, జనవరి14 (విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొం ది. అన్ని పండుగలు కన్నా, సంక్రాంతికి ఓ ప్రత్యేకత ఉంది. కాలగమనంలో ఎన్ని మార్పులు వచ్చినా సంక్రాంతి శోభ మా త్రం మసకబారదు. ముంగిట్లో భోగిమం ట, వాకిట్లో ముగ్గులు.. రైతన్నల లోగిళ్లలో ధాన్యపురాశులు .పసుపు కుంకములు అద్దుకున్న గొబ్బెమ్మలు.. హరిదాసు కీర్త నలు, జంగమ దేవర దీవెనలు, గంగిరెద్దు లు, పిండివంట లు ఘమఘములు.పేకా టలు,పిల్లలు కేరింతలు. నేడు తెలుగింటి పెద్ద పండగ సరదాల సంక్రాంతిని సంబు రంగా జరుపుకొనేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. దీనిపై విజయక్రాంతి కథనం..

సంక్రాంతి సందడి..

ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి న వలస జీవులు ఎక్కడ ఉన్నా.. సంక్రాంతి ని పురస్కరించుకునేందుకు స్వగ్రామా లకు చేరుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులతో సరదాగా గడుపుతారు. ఇప్పటికే పట్టణ వాసులు స్వగ్రామాలకు చేరుకోగా.. పల్లెలు కళకళ లాడుతున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లు ప్రధాన రహదారులు, కూడళ్లు, మార్కె ట్లు జనాలతో రద్దీగా కనిపిస్తున్నాయి.

ప్రయాణికుల రద్దీ..

సంక్రాంతి నేపథ్యంలో జిల్లాలో ఎక్కడ చూసినా ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. బు ధవారం , కొత్తగూడెం, మణుగూరు, రై ల్వేస్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిట లాడాయి. ఉదయం సికింద్రాబాద్ నుంచి వచ్చిన మణుగూరు సూపర్ఫాస్ట్ రైలులో వందల సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాం తాల నుంచి ఇక్కడకు చేరుకు న్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఉన్న వారం తా సొంత గ్రామాల్లో సంక్రాం తి వేడుకలు జరుపుకోవడానికి భారీ సం ఖ్యలో తరలిరావడంతో రైల్వేస్టేషన్ లు, బస్టాండ్లు కిక్కిరిసి పోయయి. ఏ ప్రాంతం లో చూసిన ప్రయాణికులతో రద్దీగా కని పించింది. రైల్వేస్టేషన్ల నుంచి ఆటోలు, కారులు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో స్వగ్రామాలకు చేరుకున్నారు. వాహనాల రాకపోకలు అధికమవడంతో కొన్నిచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి.

సందడిగా పల్లెలు..

సంక్రాంతి పండుగ సందర్భంగా పల్లెలన్నీ సందడిగా మారాయి. పండుగ మూ డు రోజులు ఉండడంతో పాటు మరో రెండు రోజులు అదనంగా సెలవులు రావడంతో పట్టణాల్లో నివసించే వారితో పాటు ఉద్యోగ, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతా ల్లో ఉన్న వారంతా ఈ పండుగకు పల్లెకు చే రుకున్నారు. మారుతున్న కాలా నికి తగ్గట్టుగా పనుల ఒత్తిడితో నిత్యం బిజీగా ఉండే వారంతా కొంత ప్రశాంత వాతావరణ కో సం కూడా పల్లెలకు రావ డానికి అవకాశం కలిసి వచ్చింది. అంతే కాకుండా ఆడపడుచు లు, అల్లుళ్లు, కొత్త గా పెళ్లి చేసుకున్న జంట లు కూడా సం క్రాంతి పండుగకు వచ్చేశారు.

రెండో పెద్ద పండుగ, సందడే సందడి

సంక్రాంతి పండుగ సమయానికి పొలా ల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుం టుంది. చేతికి వచ్చిన పంటను చూసి అన్నదాతలు ఆనందంతో చిరునవ్వులు చింది స్తుంటారు.ప్రతి ఇంటి లోగిళ్ల ముం దు ము గ్గులు దర్శనం ఇస్తాయి. రంగు రంగుల రం గవల్లికలు మనసును ప్రశాం తంగా ఉంచుతాయి. గాలిపటాలు, గొబ్బి ళ్లు ఇలా సం క్రాంతికి ఎన్నో పాటిస్తుంటా రు. మూడు రో జులు ఎక్కడ చూసినా వాకిళ్లలో ముగ్గులు కనిపిస్తాయి. హరి దాసులు, బుడబుక్కల వా రు గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటారు. వీరికి తోచినంత సహాయం చేస్తే భగవంతుడికి సహాయం చేసినట్లుగా గ్రామాల్లో ప్రజలు భావిస్తుంటారు. మొత్తం గా జిల్లాలో ఎక్క డ చూసినా సంక్రాత్రి సందడి నెలకొంది.