14 March, 2026 | 7:24 PM

తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

15-01-2026 01:02 AM

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేట, జనవరి 14 (విజయక్రాంతి): తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో ఏర్పాటు చేసిన బోగి పండుగ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇలాంటి వేడుకలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బడుగుల లింగయ్య యాదవ్, గాలి సాయి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ముగ్గుల పోటీల ద్వారా సృజనాత్మకత పెంపొందుతుంది

మహిళలకు నిర్వహించే ముగ్గుల పోటీలు వారిలోని సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా వారిలో ఐక్యతను పెంచుతా యని మాజీ యంయల్సి చెరుపల్లి సీతారాములు అన్నారు. సంక్రాంతి పండుగ సంద ర్భంగా చిట్యాలలో బుధవారం ఐద్వా, డివైయప్‌ఐ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఆనవాయితిగా సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. పోటీలో గెలుపొందిన మహిళలు, విద్యార్థినీలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, బొబ్బలి సుధాకర్ రెడ్డి, మేడి సుగుణమ్మ, సురేష్, దినేష్, శంకరయ్య, హరీష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

రాఘవపురం ఎక్స్‌రోడ్డులో ..

మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డు గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ కోల లింగయ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి బహుమతులు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతులు వేసిన పంటలు దండి గా పండి పుట్ల కొద్దిగా బండ్ల పైన ఇంటి కి పంటలు వచ్చిన సమయంలో గ్రామాలలో ప్రతి ఒక్కరు పిండి వంటలు చేసుకొని కొత్త బట్టలు ధరించి ఇండ్ల ముందు సంక్రాంతి ముగ్గులు వేసుకొని గోబ్బేమ్మ లను పెట్టుకోవడం ఒక సాంప్రదాయం గా వస్తున్నదని చెప్పారు.

ఇంటి ముందు గంగిరెడ్డులు ఆడుతూ హరిదాసులు పడుతూ పండుగ ప్రతిష్ట ను కీర్తించే విధంగా సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని. ఆకాంక్ష గా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోల లింగయ్య, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామ మహిళ లు, తదితరులు పాల్గొన్నారు.

నూతనకల్ మండలంలో ఘనంగా భోగి వేడుకలు

మండల వ్యాప్తంగా బుధవారం సంక్రాంతి సంబరాలు భోగి వేడుకలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.పండుగను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ప్రజలు తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. పాత వస్తువులను మంటల్లో వేస్తూ, తమ కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు కలగాలని అగ్నిదేవుడిని ప్రార్థించారు.

ప్రతి ఇంటి ముంగిట మహిళలు రంగు రంగుల ముగ్గులు వేసి పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారు. చిన్నలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేశారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పండుగ కళ ఉట్టిపడింది. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.