గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి
కొల్చారం,(విజయక్రాంతి): మండల కేంద్రమైన కొల్చారంలో మౌలిక వసతుల కల్పనకు గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ దేవన్న గారి శేఖర్ అన్నారు. శనివారం గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.ఐదు లక్షలతో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సర్పంచ్ గా ఎన్నికైనప్పటి నుండి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా గ్రామంలో నూతనంగా ఐదు పోరు బావులు తవ్వించడంతో పాటు మరో అయిదు బోరుబావులు ఫ్లెషింగ్ చేయించి త్రాగునీటి సమస్య పరిష్కరించినట్లు తెలిపారు. గ్రామంలో రక్షిత మంచినీటి కుళాయిలకు చెర్ర ను తీసివేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. వెంటనే చెర్రలను తీసివేసిన కుళాయిలకు నూతన చర్యలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాణి గోపి వార్డు సభ్యులు కృష్ణ, ఎండుగుల యాదగిరి, సీనియర్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




