1 June, 2026 | 11:45 AM

Breaking News

బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •   ప్రజాసంఘాల నాయకుల ముందస్తు అరెస్టులను ఖండించిన సీపీఎం   •  

కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ

01-06-2026 10:43 AM

కల్వకుర్తి రాజకీయాలపై సుదీర్ఘ చర్చ

​రంగారెడ్డి, మే 31 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గ పరిణామాలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు గోలి తెలిపారు.

ఈ ప్రత్యేక భేటీలో ​కల్వకుర్తిలో పార్టీ బలోపేతం,  భవిష్యత్ వ్యూహాలపై కేసీఆర్ ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు ముమ్మరంచేయాలని,నాయకులు-కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. కల్వకుర్తి నియోజకవర్గానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని కేసీఆర్ గోలి కి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలో కేసీఆర్, గోలి శ్రీనివాస్ రెడ్డిల భేటీ కల్వకుర్తి నియోజకవర్గం రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.