27 July, 2026 | 12:05 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం

01-06-2026 10:42 AM

ముత్తరం, జూన్ 01 (విజయక్రాంతి): ముత్తరం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ జాగరి సమ్మయ్య తల్లి జాగరి గట్టమ్మ ఇటీవల మృతి చెందారు. సోమవారం ఆమె పార్థివ దేహానికి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో  మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్,  యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అల్లం శేఖర్, నాయకులు మాట్ల రవీందర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతురాలికి నివాళులు అర్పించారు.