ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన సర్పంచ్ మంగమ్మ
16-03-2026 12:07 AM
బూర్గంపాడు, మార్చి15 (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇంటిని గ్రామ సర్పంచ్ వర్సా మంగమ్మ ఆదివారం ప్రారంభించారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఫిరంగి అనిత కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజల స్వంత ఇంటి కళలు సాకారం అవుతున్నాయని మంగమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామ అధ్యక్షులు కందుల రాంబాబు, వార్డు సభ్యులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.




