calender_icon.png 11 February, 2026 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారి ఓణీల అలంకరణ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్

11-02-2026 06:39:32 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభిమాని దేవర్ల సంతోష్–మమత దంపతుల కుమార్తె చిన్నారి ఓణీల అలంకరణ వేడుకను బుధవారం కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి గ్రామ సర్పంచ్ మచ్చా నర్సింహారావు హాజరై చిన్నారిని ఆశీర్వదించి, దంపతులకు అభినందనలు తెలిపారు.

చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో కూడిన ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సర్వకృష్ణ, ముప్పు మహేష్, రొడ్డ రాజు, జెల్లీ తదితరులు కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ పెద్దలు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.