8 July, 2026 | 8:54 PM

ఫేవరెట్‌గా సాత్విక్- జోడీ

14-05-2024 01:46 AM

బ్యాంకాక్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత ఏస్ షట్లర్లు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి బ్యాంకాక్ వేదికగా ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ టోర్నీలో భారత షట్లర్లు బరిలోకి దిగనున్నారు. స్టార్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ శెట్టి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ జోడీ థాయ్‌లాండ్ టోర్నీలో విజేతగా నిలవాలని భావిస్తోంది. ఈ జంట తొలి రౌండ్‌లో మలేషియాకు చెందిన అయూబ్ జైరిన్ వీ కియోంగ్ జంటతో తలపడనుంది. ఇక సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్, కిరణ్ జార్జీ, సతీశ్ కుమార్‌లు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. లక్ష్యసేన్, పీవీ సింధులు ఈ టోర్నీకి అందుబాటులో లేరు. సింధూ గైర్హాజరీలో మహి ళల సింగిల్స్ విభాగంలో అష్మిత, మాళవికా బన్సోద్, ఆకర్షి కశ్యప్ బరిలో ఉన్నారు. డబుల్స్ విభాగంలో ఉన్నతి హుడా ఫరూకీ, తనీషా పొన్నప్ప జోడీలు పాల్గొంటున్నాయి.