తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని..

06-05-2024 12:05:00 AM

ప్రతి తండ్రి కొడుక్కి ఏమి ఇద్దాం అని ఆలోచించే సమాజంలో అటువంటి అమ్మనాన్నలు ఎలాంటి ఇబ్బంది. పడకూడదు అనుకున్నాడు ఓ యువకుడు. ఆ కథేమిటో మే 10న విడుదల కానున్న ‘సత్య’ సినిమాలో తెలియనుంది. హమరేశ్, ప్రార్థనా, సందీప్ ముఖ్య తారాగణంగా వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సత్య’. శివమ్ మీడియా బ్యానర్‌పై శివ మల్లాల నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 10న విడుదల కానుంది. క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా గురించి నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ “ చాలా వేగంగా ఈ సినిమా పనులన్నీ జరిగాయి. విడుదలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుందరమూర్తి కె.ఎస్. కెమెరా: ఐ.మరుదనాయగం.