ఉచితంగా శ్రీదేవి ఇంట్లో నివసించే అవకాశం

06-05-2024 12:05:00 AM

ప్రఖ్యాత నటి శ్రీదేవి ఇంట్లో నివసించాలని ఉందా..? ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఆన్‌లైన్‌లో ఓ అప్లికేషన్ పెట్టుకోడమే. నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది వాస్తవం. చెన్నైలో శ్రీదేవికి చెందిన ఓ అందాల భవంతి ఉంది. బోనీ కపూర్‌ని పెళ్ళి చేసుకున్నాక విహారం కోసం ఆ ఇంటికే వెళ్ళేవారట శ్రీదేవి. పిల్లల పుట్టిన రోజులు మరికొన్ని ఇతర ప్రత్యేక సందర్భాల్లోనూ ఆమె కుటుంబంతో కలిసి అక్కడ గడిపేవారు. ఈ ఇంటిని హోటల్‌గా మార్చాలని శ్రీదేవి భావించారట. ఆ మేరకు ఇప్పుడు ఓ అమెరికన్ సంస్థతో బోనీ కపూర్ మరియు జాహ్నవి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఇంట్లో ఉండాలనుకునే వ్యక్తులు కొన్ని నిబంధనలతో కూడిన అప్లికేషన్‌ను ఆన్‌లైన్‌లో నింపి పంపిస్తే వారు పరిశీలించి ఆ అవకాశాన్ని కల్పిస్తారట. దాంతో వారు ఆ ఇంట్లో నివాస ఉండవచ్చు. అది కూడా ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేకుండానే. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటన రూపంలో పంచుకున్న జాహ్నవి ఇందులో ఉన్న ప్రతి వస్తువు తన తల్లి జ్ఞాపకమని, వాటిని అతిథులు భద్రంగా వుంచితే చాలని విన్నవించుకుంది.