16 March, 2026 | 3:02 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

జేత్వాన్ బుద్ధ విహార్‌లో ఘనంగా సత్యాగ్రహ దివస్

02-03-2026 09:47 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో సోమవారం అంబేద్కర్ సంఘం, భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో అంబేడ్కర్ రామ్ మందిర్ దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. 1930 మార్చి 2న మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో రామ్ మందిరంలో దళితులకు ప్రవేశాన్ని నిషేధించడాన్ని నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వేలాది అనుచరులతో కలిసి సత్యాగ్రహానికి పూనుకున్నారని నాయకులు గుర్తు చేశారు. ఈ ఉద్యమం ఫలితంగా రామ్ మందిర ప్రవేశానికి అనుమతి లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజును సత్యాగ్రహ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని పేర్కొన్నారు.