2 March, 2026 | 11:32 PM

తనయుని జ్ఞాపకార్థం హనుమాన్ మందిర సుందరీకరణ

02-03-2026 09:44 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలోని శ్రీ హనుమాన్ మందిరంలో కీర్తిశేషులు బైండ్ల తొగరి రంజిత్ కుమార్ జ్ఞాపకార్థం ఆలయ సుందరీకరణ పనులు భక్తిశ్రద్ధలతో పూర్తయ్యాయి. ఎక్స్ ఎంపీపీ బైండ్ల తొగరి సుదర్శన్  తన పెద్ద కుమారుడు రంజిత్ కుమార్ స్మృతిలో రూ.30,000 విరాళం అందించి ఆలయ ఆవరణను టైల్స్‌తో నవీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి–సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ బైండ్ల తొగరి దశరథం,

మాజీ పీఏసీఎస్ చైర్మన్ జాంగారి కిష్టారెడ్డి, పాలకేంద్రం అధ్యక్షుడు ఊడెం గాలి రెడ్డి, గురుస్వామి గోగుల సిద్ధరాములు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన సుదర్శన్ ని గ్రామస్తులు ఘనంగా అభినందించారు. అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని హనుమంతుని ప్రార్థించామని తెలిపారు. తన ఊపిరి ఉన్నంతవరకు పుట్టిన ఊరి అభివృద్ధి, సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తానని వెల్లడించారు.