20 March, 2026 | 2:44 AM

కస్తూర్బా ట్రస్టుకు సేవ్ ఫౌండేషన్ కానుక

20-03-2026 01:03 AM
  1. అత్యాధునిక స్టీమ్ కుకింగ్ యూనిట్ అందజేత

నిర్వాసితుల సంక్షేమం కోసం ఎండీ రాజశేఖర్ చొరవ

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 19 (విజయక్రాంతి): పరాభవ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సేవ్ ఫౌండేషన్ ఉదారతను చాటు కుంది. కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థలోని నివాసితుల కోసం అత్యాధునిక ‘స్టీమ్ కుకింగ్ యూనిట్’ను అందజేసింది. సెవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సెవ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి రాజశేఖర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను గురువారం ట్రస్ట్ ప్రతినిధులకు అప్పగించారు.

ఈ నూతన సాంకేతిక పరికరం ద్వా రా ట్రస్ట్లోని వందలాది మందికి తక్కువ సమయంలో, నాణ్యమైన ఆహారాన్ని అందించే వీలు కలగనుంది. సాధారణ వంట పద్ధతులతో పోలిస్తే ఈ స్టీమ్ కుకింగ్ యూనిట్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కేవలం 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 150 మందికి సరిపడా అన్నం, కూర, సాంబారును ఒకేసారి తయారు చేసుకోవచ్చు.

దీనివల్ల వంట చేసే సిబ్బందికి శ్రమ తగ్గడమే కాకుండా, గ్యాస్ వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆధునిక కాలంలో ఇంధన పొదుపు,సమయ పాలన పాటిస్తూ, ఎక్కువ మందికి వేగంగా భోజనం సిద్ధం చేయడానికి ఈ పరికరం ఎంతగానో ఉపయో గపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉగాది రోజున తమ సంస్థకు ఇంతటి విలువైన పరికరాన్ని అందించినందుకు కస్తూర్బా ట్రస్ట్ ప్రతినిధి పద్మావతి సేవ్ ఫౌండేషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

నిర్వాసితుల అవసరాలను గుర్తించి, వారి సంక్షేమం కోసం నిరంతరం తోడ్పాటునందిస్తున్న సేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వి రాజశేఖర్ దాతృత్వాన్ని ఆమె కొనియాడారు. ఈ స్టీమ్ కుకింగ్ యూనిట్ రాకతో ఆహార తయారీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ఆనం దం వ్యక్తం చేశారు. నూతన సంవత్సర ఆరంభంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేప ట్టడం పట్ల పలువురు సామాజిక కార్యకర్తలు సెవ్ ఫౌండేషన్‌ను అభినందిస్తున్నారు.