బ్రిక్స్ సభ్య దేశాధినేతలతో ప్రధాని భేటీ.. షెడ్యూల్ ఇదే
11-09-2026 | 01:13pm
న్యూఢిల్లీ: బ్రిక్స్ సభ్య(BRICS Summit 2026) దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) భేటీ కానున్నారు. భారత విదేశాంగశాఖ ప్రధాని మోదీ భేటీకి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాళ రష్యా, ఇరాన్ దేశాధినేతలు, ఐరాస సెక్రటరీ జనరల్(UN Secretary-General)తో ప్రధాని భేటీ కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) సమావేశం కానున్నారు. సాయంత్రం 6.15 గంటలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్(Iranian President Pezeshkian)తో మోదీ కీలక చర్చలు జరపనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తో నరేంద్ర మోదీ ప్రత్యేక భేటీ జరగనుంది.