అనిల్ అంబానీపై సెబీ నిషేధం.. 25 కోట్ల జరిమానా
ముంబయి: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లో నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో అనిల్ అంబానీ సహా కీలక అధికారులు, 24 సంస్థలపై సెబీ చర్యలు చేపట్టింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులకు, సదరు 24 సంస్థలకూ నిషేధాన్ని వర్తింపచేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అనీల్ అంబానీపై సెబీ రూ. 25 కోట్ల జరిమానా విధించింది. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఎలాంటి కార్యకలాపాలలోనూ పాల్గొనొద్దని ఆంక్షలు విధించింది. నమోదిత కంపెనీ, సెబీలో రిజిస్టర్ అయన మధ్యవర్తిత్వ సంస్థల్లో డైరెక్టర్ సహా ఎలాంటి కీలక పదవులలో ఉండొద్దని ఆదేశించింది. ఆర్ హెచ్ ఎఫ్ ఎల్ ను సైతం ఆర్నెల్ల పాటు మార్కెట్ల నుంచి నిషేధించింది. అనిల్ అంబానీ తన అనుబంధ సంస్థ లకు రుణాల రూపంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధులను మళ్లించారనేదే ఆయనపై సెబీ ప్రధాన ఆరోపణ.






