calender_icon.png 16 September, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ ఫస్ట్ వరకు 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలు

01-11-2024 06:34:03 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా  ప్రశాంతత ను పెంపొందించేందుకు 2 నవంబర్ 2024 నుంచి 1 డిసెంబర్ 2024  వరకు జిల్లా అంతటా 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి. జానకి స్పష్టం చేశారు. ఈ 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు జరుపరాదన్నారు.

నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను, జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధమని, రాళ్ళను జమ చేయుట,  ధరించి సంచరించుట వంటివి నిషేధించడం జరిగిందని,లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈ సమయంలో ఉపయోగించకూడదని పేర్కొన్నారు. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన  30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షార్హులు అవుతారని ఎస్పి  పేర్కొన్నారు.