జమాఅత్-ఎ-ఇస్లామీ హింద్, ఆధ్వర్యంలో సీరత్ ప్రచారం
కరీంనగర్ సిటీ సెప్టెంబర్11 (విజయశాంతి): పెరుగుతున్న నేరాలు, మాదకద్రవ్యాల వ్యసనం,(Drug addiction) సైబర్ మోసాలు, మహిళలపై అఘా యిత్యాలను అరికట్టి నైతిక విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో జమాఅత్అఇస్లామీ హింద్ (JIH), కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో “సీరత్ క్యాంపెయిన్ 2026" నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.“సకల చరాచర సృష్టికి కారుణ్యమూర్తి" అనే ఇతివృత్తంతో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఈ ప్రచారం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రవక్త ముహమ్మద్ (సల్ల ల్లాహు అలైహి వసల్లం) వారి ఆదర్శ జీవితం ద్వారా శాంతి, నైతికత, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రచారం ప్రధాన ఉద్దేశ్యమని తెలి పారు.
కరీంనగర్లో(Karimnagar) సుమారు 4 లక్షల మందికి ప్రచార సందేశాన్ని చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఆఫ్లైన్ ప్రచారంతో పాటు డిజిటల్ మాధ్యమాలను(digital media) విస్తృతంగా వినియోగించనున్నారు. వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్త లతో సమావేశాలు నిర్వహించడంతో పాటు వివిధ మతాల ప్రతినిధులతో మతాంతర సంభాష ణలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రచారంలో భాగంగా ద్విభాషా పుస్తకాలు, ఫోల్డర్లు, డిస్ప్లే బోర్డులు, గిఫ్ట్ ప్యాక్లు, షార్ట్ వీడియోల ద్వారా అవగాహన కల్పించనున్నారు. రుమాన్ ఆసు పత్రి సహకారంతో భారీ రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 25 నుంచి సీరత్ ఎక్స్పో
ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు “సీరత్ ఎక్స్పో 2026”(Seerat Expo 2026) నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న యూత్ మీట్, 26న CIO మీట్, నూరి మెహ ఫిల్/కల్చరల్ నైట్, 27న భారీ బహిరంగ సభ "ఖితాబఆమ్” నిర్వహించనున్నట్లు నిర్వాహ కులు తెలిపారు.సీరత్ క్యాంపెయిన్ జిల్లా కన్వీనర్గా సోహెబ్ అహ్మద్ ఖాన్, కోకన్వీనర్లుగా ఆరిఫ్ ఇర్ఫాన్, ముహమ్మద్ ఇస్టాక్ అలీ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాల వివరా లను వెల్లడించేందుకు సెప్టెంబర్ 10న కరీంనగర్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వ హించారు. ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మీడియా సహకరిం చాలని నిర్వాహకులు కోరారు.