28 February, 2026 | 8:02 PM

మెరిట్ స్కాలర్షిప్ కు కడెం విద్యార్థుల ఎంపిక

28-02-2026 06:22 PM

కడెం,(విజయక్రాంతి): కడెం మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ టెస్టుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు మహమ్మద్ అర్హాన్, జక్కుల అశ్విత్, పి.చేతన్ సాయిలు స్కాలర్షిప్ కు ఎంపికయ్యారు. ప్రతి నెల ఒక వెయ్యి రూపాయల ఉపకార వేతనం ను నాలుగు సంవత్సరాల పాటు విద్యార్థులు పొందుతారని ఆయన తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి ఉపకార వేతనానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.