17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ములుగులో మత్తు జోరు

03-02-2026 08:42 PM

ఎక్సైజ్ ఆఫీస్ ముందే మందుబాబు నిద్ర 

కళ్లముందే ఉన్న స్పందన శూన్యం 

ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రజల్లో తీవ్ర అందోళనలు

 ములుగు,(విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయం-ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఓ వ్యక్తి మద్యం మత్తులో గంటల తరబడి స్పృహ లేకుండా పడిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. మంగళవారం ఉదయం నుంచే సదరు వ్యక్తి ఎక్సైజ్ కార్యాలయం మెట్ల మార్గంలో మత్తులో నిద్రపోతూ కనిపించాడు.

ప్రభుత్వ కార్యాలయం ముందు ఇలాంటి పరిస్థితి ఉన్నా, కార్యాలయంలో సిబ్బంది ఉన్నప్పటికీ కనీసం స్పందించకపోవడం విమర్శలకు దారి తీసింది. ప్రజల రాకపోకల మధ్య ఈ దృశ్యం కనిపించడంతో స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాటు సారా నిర్మూలన, అక్రమ మద్యం నియంత్రణ ప్రధాన బాధ్యతగా వహించాల్సిన ఎక్సెజ్ శాఖ కార్యాలయం ముందే మద్యం మత్తు ఘటన జరగడం విరోధాభాసంగా మారింది. సదరు వ్యక్తి నాటు సారా సేవించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నా, కనీస విచారణ కూడా జరగకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

“ఎక్సెజ్ ఆఫీస్ ముందే ఇలాంటి దృశ్యం కనిపిస్తే ఇక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రత, చట్ట అమలుపై పర్యవేక్షణ వహించాల్సిన అధికారులు ఈ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించడం తగదని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్సెజ్ శాఖ ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.