వినాయక ఉత్సాహాల్లో సేవా కార్యక్రమాలు
26-09-2026 | 09:43pm
నిర్మల్ సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి) : నిర్మల్లో(Nirmal) గణేష్ నిమజ్జన వేడుకల(Ganesh immersion ceremony) సందర్భంగా నిర్మల్ మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణి చక్రవర్తి(Appala Kavya Gani Chakravarti) ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను(Service activities) నిర్వహించారు. భక్తులకు ఉచితంగా పులిహోర భోజనం వాటర్ పాకెట్లను పంపిణీ చేశారు. రాత్రి పలు ప్రాంతాల్లో భక్తులకోసం అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి ఈసారి మరో ప్రత్యేకత ఉంది. గత రెండేళ్లుగా నిమజ్జనం సందర్భంగా అన్నదానం నిర్వహిస్తున్న గణేష్ చక్రవర్తి.. ఈ ఏడాది తన పుట్టినరోజు రోజునే భక్తులకు అన్నదానం చేయడం విశేషంగా నిలిచింది. పుట్టినరోజు వేడుకలకు బదులుగా.. భక్తులకు సేవ చేస్తూ రోజును జరుపుకోవడం పలువురిని ఆకట్టుకుంది.