calender_icon.png 16 June, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైద్యునికి సేవా పురస్కార అవార్డు

16-06-2025 12:00:00 AM

నిర్మల్ జూన్ 15 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో ఆర్థోపెడిక్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రమోద్ చంద్రరెడ్డికి ఆదివారం సుమన్ టీవీ సేవా పురస్కార అవార్డు లభించింది. వైద్య రంగంలో సేవ భావంతో పేద రోగులకు అందిస్తున్న ఉచిత సేవలతో పాటు సామాజిక రంగంలో ఆయన చేసిన కృషిగాను సుమన్ టీవీ గుర్తించి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. హైదరాబాదులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో డా.ప్రమోద్ చంద్ర రెడ్డి ఈ అవార్డు స్వీకరించారు. అవార్డు అందుకున్న ప్రమోద్ చంద్రరెడ్డికి ఆదిత్య హాస్పిటల్ ప్రత్యేకంగా అభినందించింది.