పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
ఏడుగురు అరెస్ట్
బెల్లంపల్లి: మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీలో పేకాట స్థావరం(Poker base) పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి(Task Force police raid) చేసి ఏడుగురునీ పట్టుకున్నారు. వివరాలిలావున్నాయి. డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రామగుండం కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్(Ramagundam Commissionerate Task Force ACP Srinivas) ఆధ్వర్యంలో ఎస్‌ఐ దీకొండ రమేష్ సిబ్బంది ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేశారు. బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీలో నిర్వహించిన ఈ దాడిలోపేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 52 పేకముక్కలు, రూ.10,480 నగదు, 7 మొబైల్ ఫోన్లు, ఒక హీరో హోండా సీడీ 100 ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురు వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, పేకముక్కలు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.