13 June, 2026 | 3:26 PM

జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

13-06-2026 02:24 PM

హైదరాబాద్: జీడిమెట్లలో(Jeedimetla) అక్రమంగా ఉంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్(Seven Bangladeshis arrested) చేశారు. పాస్ పోర్టు, వీసా సహా ఎలాంటి చెల్లుబాటు పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు. అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి నివసిస్తున్నట్లు విచారణలో గుర్తించారు. అదుపులోకి తీసుకున్న బంగ్లాదేశీయులను మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్‌కు(Jogipet Deportation center) తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వాళ్లను వారి స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కూకట్‌పల్లి జోన్ ఎస్వోటీ  సిబ్బంది(Kukatpally Zone SOT personnel) ఈ ఆపరేషన్ నిర్వహించింది.