చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో విషాదం.. పెంపుడు కుక్క మృతి
13-06-2026 03:16 PM
తుని: కాకినాడ జిల్లా తునిలో చిన్నారి మిస్సింగ్ కేసులో(Kakinada Girl missing case) విషాదం చోటుచేసుకుంది. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక ఆధారమైన పెంపుడు కుక్క మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడంతో కుక్క ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుక్క మృతితో చిన్నారి అదృశ్యం దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. 80 నిమిషాల్లో పెంపుడు కుక్క ఎనిమిది కిలో మీటర్లు సంచరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పెంపుడు కుక్క జీపీఎస్ ట్రాకర్ తో గాలింపు చర్యల్లో పాల్గొంది. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగున్నాయి. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.






