8 June, 2026 | 7:22 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

తొలిరోజే ఏడు సెంచరీలు

12-10-2024 12:00 AM

రంజీ ట్రోఫీ 2024-25

న్యూఢిల్లీ: రంజీ ట్రోఫీలో భాగంగా తొలిరోజే ఏడు సెంచరీలు నమోదవ్వడం విశేషం. తొలి రోజు మొత్తం 16 ఎలైట్ మ్యాచ్‌లు, 3 ప్లేట్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. సుదీప్ (బెంగాల్), శుభమ్ ఖజురియా (130*, జమ్మూ కశ్మీర్), రవి చౌహాన్ ( సర్వీసెస్), మనన్ హింగ్రజియా (174*, గుజరాత్), శుభమ్ అరోరా (హిమాచల్ ప్రదేశ్), ప్రశాంత్ (హిమాచల్ ప్రదేశ్), సుయాశ్ (గోవా) సెంచరీలు సాధించారు.

కాగా దేశవాలీ క్రికెట్ టోర్నీల్లో బీసీసీఐ కీలక నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై మిడ్ ఇన్నింగ్స్‌ల్లో ఆటగాళ్లు గాయాలు, అనారోగ్యం, అత్యవసర సమయం మినహాయించి మిగతా కారణాలతో రిటైర్డ్‌గా వెనుదిరిగితే ఆ మ్యాచ్‌లో మరోసారి బరిలోకి దిగేందుకు అవకాశం లేదు. ఈ నిబంధన బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వర్తిస్తుందని బీసీసీఐ పేర్కొంది.  బాల్ టాంపరింగ్, ఓవర్ త్రో బౌండరీల్లోనూ పలు మార్పులు చేశారు.