7 August, 2026 | 6:49 PM

లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

07-08-2026 06:17 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుల షేక్ యూసుఫ్ అధ్యక్షతన, 14వ వార్డు కౌన్సిలర్ సరికొప్పుల విజయలక్ష్మి నాగేశ్వరరావు  సౌజన్యంతో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ లయన్ చల్లా ప్రభాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ... పేద, నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందించాలనే గొప్ప ఆశయంతో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

ముఖ్యంగా సూర్యాపేట లయన్స్ క్లబ్ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత కంటి పరీక్షలు, వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం లయన్స్ క్లబ్‌కు గర్వకారణమని అన్నారు. లయన్స్ క్లబ్ అందిస్తున్న ఈ ఉచిత వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ చామంతి, రాజు, సరిత , క్లబ్ ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ, బాల వెంకటేశ్వర్లు, జీఎంటి కోఆర్డినేటర్, లాయర్ విశ్వనాథం, అడ్వైజర్ కమిటీ మెంబర్ కొప్పు లక్ష్మీనారాయణ గౌడ్, రూపావత్ బాలు మహేంద్ర, భరత్,అంజి  తదితరులు పాల్గొన్నారు.