7 August, 2026 | 7:37 PM

భూగర్భ జల సంరక్షణకు ఇంకుడు గుంతలు

07-08-2026 06:25 PM

- దేవలమ్మ నాగారంలో జలసిరి కార్యక్రమం

చౌటుప్పల్,(విజయక్రాంతి): భూగర్భ జల సంరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయని సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని మండలంలోని దేవలమ్మ నాగారం గ్రామంలో శుక్రవారం ప్రారంభించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... వర్షపు నీరు భూగర్భంలోకి వెళ్లేందుకు ఇంకుడు గుంతలు దోహదపడతాయన్నారు. వర్షపు నీటిని నిల్వ చేసేందుకు వీలుగా, నీటి మట్టాల పెంపుదలకు ఇంకుడు గుంతలు ప్రాముఖ్యత వహిస్తాయన్నారు. గ్రామంలో సాధ్యమైనంత వరకు ఇంకుడు గుంతలు నిర్మించాలని పిలుపునిచ్చారు.