18 April, 2026 | 3:48 PM

ఏడుగురు అధికారులపై వేటు

27-08-2024 01:36 AM

దర్శన్ జల్సా వ్యవహారంలో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

బెంగళూరు, ఆగస్టు 26: అభిమాని రేణుకాస్వామి హత్య చేయిం చిన కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు అందటంపై పోలీ సు విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ఏడుగు రు పారప్పణ అగ్రహార జైలు అధికా రులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, ఇది తీవ్రమైన భద్రతా లోపమని రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. జైల్‌లో దర్శన్‌కు లభిస్తున్న మర్యాదలకు సంబంధించి ఆదివారం ఓ ఫొటో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

అనంతరం దీనికి బలం చేకూరుస్తూ ఓ వీడియో కూడా లీకైంది. 25 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోలో దర్శన్ తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డీజీ మాలిని కృష్ణమూర్తి విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్‌లు, ఇతర నిందితులను విచారించిన అనంతరం తనకు నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. నిందితుడికి సకల సౌకర్యాలు లభించడంపై రేణుకాస్వామి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దోషులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.