ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి
27-08-2024 01:38 AM
రష్యాలోని సరాటోవ్‌లోని వోల్గా స్కైపైకి ఉక్రెయిన్ డ్రోన్ దాడిని సీరియస్‌గా తీసుకున్న రష్యా.. సోమవా రం ఉక్రెయిన్‌పై దాదాపు 100కు పైగా డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుప డింది. ఉక్రెయన్ రాజధాని కీవ్ పరిసర నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. దాడుల్లో మరణించిన వారి వివరాలు అధికారికంగా ఇంకా ప్రకటిం చనప్పటికీ భారీగానే ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. దాడి కారణంగా కీవ్‌లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.






