కాలిఫోర్నియా మహిళా సెనెటర్.."సెక్స్-బేస్డ్ క్విడ్ ప్రో కో"!
శాక్రమెంటో: కాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్, మేరీ అల్వరాడో-గిల్, తనను "సెక్స్-బేస్డ్ క్విడ్ ప్రో కో రిలేషన్‌షిప్"లోకి ప్రవేశించమని బలవంతం చేశారని ఆమె దగ్గర చీఫ్ ఆఫ్ స్టాఫ్ హోదాలో సేవలందించిన చాడ్ కాండిట్ ఆరోపించాడు. ఆమె తనను శృంగార బానిసగా వాడుకున్నారని గతంలో పురుష సిబ్బందిగా పని చేసిన ఆయన మండిపడ్డారు. అలా పలు మార్లు చేయడంతో తాను తీవ్రమైన వెన్నునొప్పి,వినికిడి లోపం, తుంటి సంబంధిత గాయాలతో బాధపడినట్లు పేర్కొన్నాడు. కాగా మహిళా సెనేటర్ మేరీ అల్వరాడో-గిల్ కార్యాలయంలో పని చేసిన మాజీ కాంగ్రెస్ సభ్యుడిగా గతంలో ప్రజాజీవితంలో రాజకీయరంగంలో పని చేసిన గ్యారీ కాండిట్ కుమారుడే.. ఈ మహిళా సెనటర్ వద్ద పని చేసిన మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, చాడ్ కాండిట్ అని తెలుస్తోంది. మాజీ సిబ్బందిగా ఆమె తరఫున ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో పనిలో భాగంగా కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఎక్స్-రేటెడ్ చర్యలు చేయమని తనను ఒత్తిడి చేసినందుకు గత వారం ఆమెపై దావా వేశారు. తరచూ అసహజ శృంగారం కోసం డిమాండ్ చేసేవారని కాదంటే బెదిరించేవారని వెల్లడించారు. బలవంతంగా కోర్కెలు తీర్చుకునేవారని తెలిపారు.
కాలిఫోర్నియాలోని రాజధాని నగరం శాక్రమెంటోలో రాష్ట్ర సెనేటర్ మేరీ అల్వరాడో-గిల్, ఒక వివాహిత అయినప్పటికీ అలా అనుచితంగా ప్రవర్తించడంపై ఆయన దిగ్భ్రాంతికి గురైనట్లు శాక్రమెంటో సుపీరియర్ కోర్ట్‌లో దాఖలు చేసిన దావాలో పేర్కొన్నారు. కానీ అల్వరాడో-గిల్ తను రిపబ్లికన్ పార్టీకి మారుతున్నట్లు ఆగస్టు 8, 2024న గురువారం ప్రకటించింది. కాగా డెమొక్రాట్‌గా మారిన రిపబ్లికన్ రాజకీయవేత్త గా తన ఉద్యోగం ఎక్కడ హుష్ కాకీ అయి పోతుందేమోనని ఆ మహిళా సెనెటర్ అభీష్టం మేరకు.. అయిష్టంగానే లైంగిక పరమైన ఫేవర్ కు ఒప్పుకోవాల్సి వచ్చిందని దావాలో కాండిట్ పేర్కొన్నాడు. అయితే శాంటాక్లాజ్ డ్రస్ వేసుకోలేదని ఆమె తనను గత డిసెంబర్లో ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. కానీ ఈ ఆరోపణలను సెనెటర్ కొట్టి పారేశారు. ఈ మహిళా సెనెటర్ కొన్ని నెలల కిందట లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో బిల్లును ప్రవేశ పెట్టడం గమనార్హం.






