7 May, 2026 | 9:54 PM

పీవోపీ విగ్రహాలను కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలి: హైకోర్టు

10-09-2024 06:21 PM

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం స్పష్టత ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలన్న హైకోర్టు మట్టి ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని తీర్పునిచ్చింది. పీవోపీ విగ్రహాలను కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలని హైకోర్టు వెల్లడించింది. గత రెండేళ్లలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని పిటిషనర్ వేణుమాధవ్ పేర్కొన్నారు. నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్ పై భారీ క్రేన్లు నిలుపుతున్నారని పిటిషనర్ వేణుమాధవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారీ క్రేన్ల వల్ల ట్యాంక్ బండ్ ను ముప్పు ఉందని పిటిషనర్ తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ ఇంత ఆలస్యంగా ఎందుకు వేశారని పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు 2021 నాటి మార్గదర్శకాలను పాటించాలని మరోసారి స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలను సహజ జలవనరుల్లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.