క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి
మేయర్ కొలగాని శ్రీనివాస్
70వ ఎస్జీఎఫ్ కరీంనగర్ అర్బన్ వాలీబాల్ పోటీలు ప్రారంభం
కేపీఎస్ హైస్కూల్‌లో ఘనంగా నిర్వహణ
కరీంనగర్, సెప్టెంబరు 11(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి అన్ని రంగాల్లో రాణించాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Karimnagar City Mayor Kolagani Srinivas) పిలుపునిచ్చారు. 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) కరీంనగర్ అర్బన్ ఆధ్వర్యంలో అండర్14, 17 బాలబాలికల విభాగాల్లో కరీంనగర్ లోని రేకుర్తిలో గల కేపీఎస్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న వా లీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు.
క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణా లు, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెంపొందుతాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వ ర్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా కార్యక్రమా లు గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిభావంతులకు సరైన వేదికలు కల్పిస్తే వారు రాష్ట్ర, జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని తెలిపారు. డీఈఓ చైతన్య జైని మాట్లాడు తూ విద్యార్థుల సమగ్ర వికాసంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
పాఠశాల స్థా యి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచడం ద్వారా భవిష్యత్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను తయారు చేయవచ్చని తెలిపారు. ఎస్జీఎఫ్ వంటి పోటీలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి అవకాశాన్ని కల్పి స్తాయన్నారు. కోట విద్యాసంస్థల అధినేత డాక్టర్ డి. అంజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడా ప్రతిభను వెలికితీసేలా విద్యాసంస్థలు నిరంత రం ప్రోత్సహిస్తున్నాయన్నారు. పోటీల్లో పా ల్గొంటున్న విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో ముం దుకు సాగాలన్నారు.
భవిష్యత్ లోనూ విద్య తో పాటు క్రీడలకు అవసరమైన ప్రోత్సాహా న్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గాజా శివరాం, జిల్లా ఎస్జీఎఫ్ కార్య దర్శి బన్సీలాల్, అర్బన్ కార్యదర్శి శంకర య్య, నేషనల్ వాలీబాల్ ప్లేయర్, పీఈటీ శ్రీ నివాస్, సెక్టార్ అధికారి అశోక్‌రెడ్డి, డీసీఈబీ భగవంతయ్య, మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి వే ణుగోపాల్, ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడాకారులు, విద్యార్థినీ విద్యార్థులున్నారు.