పదవ తరగతి ఫలితాల్లో శాంతినికేతన్ ఘనత
29-04-2026 06:57 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో 100% ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్, కరస్పాండెంట్ స్ భగవతి పద్మనాభ గౌడ్ తెలిపారు. 53 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాలలో ఆయన అభినందించి సన్మానం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దిట్టుగా మంచి ఫలితాలను సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు






