వాసవి విద్యార్థుల ప్రతిభ
29-04-2026 07:01 PM
భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని వాసవి విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు నిర్వాకులు పోతారెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన తనయా రెడ్డి 600 మార్కులకు గాను 587 మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా 550 కి పైగా మార్కులను పలువురు విద్యార్థులు సాధించడంతో వారికి ప్రత్యేకంగా అభినందించి సన్మానం చేశారు.






