17 April, 2026 | 10:04 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గొర్రెలను వేటాడిన కుక్కలు

11-04-2025 10:14 AM

ఆరు గొర్రెల  మృతి 

ఎమ్మెల్యే ఆదుకోవాలని వేడుకోలు

రాజాపూర్: మండల పరిధిలోని తిరుమలాపూర్(Tirmalapur) గ్రామంలో గొర్రెలను కుక్కలు వేటాడిన సంఘటనలో చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి జల్లికట్టిన గొర్రెలపై కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటనపై గొర్రెల కాపలాదారుడు కొల్లూరు పెద్ద రాములు  కి తీర విషాదాన్ని మిగిలింది. ఎండనక్క వాననక శ్రమించి కాపాడుకుంటున్న గొర్రెలపై ఒక్కసారిగా అర్ధరాత్రి కుక్కలు దాడి చేయడంతో చేసిన కష్టం వృధా అయ్యిందని గొర్రెల కాపలాదారుడు తీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గొర్రెల మందను ఊరు బయట దొడ్డిలో తొలి రాత్రి సమయంలో ఇంటి దగ్గర వెళ్లారు.

అదే రాత్రి వీధి కుక్కలు గొర్రె మందల్లో చొరబడి ఆరు గొర్రెల గోతులు కొరికి కొరికి దారుణంగా చంపివేశాయి .ఉదయం గొర్రెల కాపరి మందలో చూడగా ఆరు గొర్రెలు మృతి చెందాడంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. గ్రామంలో వీధి కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. వీధి కుక్కల వల్ల పశువుల తో పాటు, మనుషులపై ,చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. వీధి కుక్కల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం కొల్లూరు పెద్ద రాములు ఆర్థికంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(Jadcherla MLA Anirudh Reddy) ఆదుకోవాలని కోరుతున్నారు.