ఆటో దొంగతనం నిందితుడి రిమాండ్
29-06-2026 08:26 PM
అశ్వారావుపేట,(విజయక్రాంతి): ఆటో దొంగలించిన కేసులో నిందితుడు ను రిమాండ్ కు పంపినట్టు అశ్వారావుపేట సీఐ నాగరాజు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఎస్ ఐ యయాతి రాజు తో కలసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీన శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ ఎదురుగా రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఏ పి39 వి ఏ 1713 ఆటోను దొంగలించారని అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం గ్రామానికి చెందిన మహంకాళి వెంకటేష్ ఫిర్యాదు మేరకు ఎస్ ఐ యయాతి రాజు కేసు నమోదు చేశారు దర్యాప్తు లో భాగంగా ఆటో దొంగతనం చేసిన సత్తుపల్లి మండలం షేక్ రహీంను అరెస్టు చేసి ఆటోని స్వాధీన పరచుకుని రిమాండ్ కు తరలించిన్నట్టు అశ్వరావుపేట సిఐ నాగరాజు వెల్లడించారు. అశ్వరావుపేట అదనపు SI J. దేవ్ సింగ్ ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






