29 June, 2026 | 9:37 PM

కల్వర్టుల కోసం ప్రతిపాదనలు

29-06-2026 08:14 PM

తాంసి/భీంపూర్,(విజయక్రాంతి): భీంపూర్ మండలంలోని అంతర్ గావ్, ఆర్లీ (టీ), ఇందుర్ పల్లి,సమీప కల్వర్టులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచనతో సోమవారం ఆర్&బి ఏఈ ప్రవీణ్ పరిశీలించారు. కొత్త కల్వర్టుల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఏఈ అన్నారు. వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టుల వద్ద ముందు జాగ్రతగా ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తామన్నారు. ఏఈ తో పాటు బీఆర్ఎస్ నాయకుడు బక్కి కపిల్ యాదవ్,తదితరులు ఉన్నారు.