15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఓరుగల్లు సంస్కృతి ఉట్టిపడేలా శివరాత్రి ఉత్సవాలు

14-02-2026 09:35 PM

ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): ప్రపంచంలో అత్యంత వైభవమైనది ఓరుగల్లు సంస్కృతి అని, ఓరుగల్లు సంస్కృతి ఉట్టిపడేలా శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మహా శివరాత్రి -2026 ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించే హయగ్రీవాచారి గ్రౌండ్స్ సభా ప్రాంగణాన్ని ప్రముఖ యోగ సాధకులు జిల్లా ప్రభు చైతన్య, హిందువాహిని ఉమ్మడి జిల్లా నేత శ్రీ రామ్ ఉదయ్, కార్పొరేటర్ రవి నాయక్, హిందువాహిని రాష్ట్ర సంపర్క ప్రముఖ్ సూర్య ప్రకాష్ రెడ్డి, సాయిలతో కలసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.

అనంతరం రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం లాగే ఈసారి కూడా ఓరుగల్లు ఆధ్యాత్మికత, శివతత్వం, కళలు, సంస్కృతి ఉట్టిపడేలా శివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని,సాయంత్రం 5 గంటలకు శివపార్వతుల కళ్యాణం తో కార్యక్రమం ప్రారంభం అవుతుందని,పేరిణి శివతాండవం, లింగోద్భవ సమయంలో సప్తహారతీ, కూచిపూడి, భరత నాట్యం, వంటి సాంప్రదాయ నృత్యాలు, దేశభక్తి ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇస్కాన్ స్వామీజీ రాథామనోహర్ దాస్ ప్రవచనం, పద్మశ్రీ కిన్నెర మిగిలయ్య కిన్నెర కళారూప ప్రదర్శన, ఆర్పీ పట్నాయక్, నల్గొండ గద్దర్, కాసర్ల శ్యామ్ ల యొక్క  స్వరాభిషేకం,  సాంస్కృతిక కార్యక్రమాలు  ఉంటాయన్నారు.

 ప్రముఖ యోగా సాధకులు,జిల్లా ప్రభు చైతన్య మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో జెన్ జీ యువత వ్యసనాల వైపు మల్లుతున్న తరుణంలో ఆధ్యాత్మికత వైపు, సంస్కృతికి, కళల వైపు ఇండస్ ఫౌండేషన్, ఏనుగుల రాకేష్ రెడ్డి మళ్లిస్తున్న తీరు ఎంతో గొప్పదని అన్నారు. వీహెచ్పీ నేత శ్రీ రామ్ ఉదయ్ మాట్లాడుతూ గత ఆరేళ్లుగా దిగ్విజయంగా నడుస్తున్న ఈ మహా శివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం కేవలం ఒక ఇండస్ ఫౌండేషన్ కార్యక్రమం లాగా కాకుండా ఒక కాకతీయుల ఉత్సవంగా, ఓరుగల్లు ప్రజల పండగగా, మినీ కుంభమేళా గా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ కన్వీనర్ కత్తిల అభిషేక్, ఇండస్ ఫౌండేషన్ కార్యదర్శి పురుషోత్తం యాదవ్, కార్యక్రమం కోఆర్డినేటర్ లు సుకాంత్, దీపక్, అఖిల్ రెడ్డి, వంశీ, చిర్ర సుమన్, శానబోయిన రాజ్ కుమార్, దేవయ్య, కొమురయ్య, రాజేందర్, కొడారి రవి, లక్ష్మణ్, భాస్కర్, నరేష్, తిలక్ రెడ్డి, రమేష్, మనోజ్  తదితరులు పాల్గొన్నారు.