యూనివర్సిటీలో కాల్పులు
02-03-2025 12:24 AM
- విద్యార్థి మృతి
- అలీగఢ్ యూనివర్సిటీలో ఘటన
అలీగఢ్, మార్చి 1: అలీగఢ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగి.. ఓ విద్యార్థి మరో విద్యార్థిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో రెండో విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని మహ్మద్ కైఫ్‌గా గుర్తించారు. ఈ ఘటన తర్వాత విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థులు దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.






