9 May, 2026 | 1:18 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

మరో ప్రపంచ యుద్ధం జరగనుందా?

02-03-2025 12:20 AM
  1. యుద్ధంపై ఉక్రెయిన్‌ను నిందించిన అమెరికా అధ్యక్షుడు
  2. మూడవ ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నారంటూ ఆగ్రహం
  3. ధీటుగా బదుల్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
  4. అర్ధాంతరంగా నిలిచిపోయిన చర్చలు 

వాషింగ్టన్, మార్చి 1: శ్వేతసౌధం వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య మాటల యుద్ధం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాక్రమణకు ముగింపు పలకడానికి అమెరికా మద్దతు కోరడం, దానికి బదులు తమ దేశంలోని అరుదైన ఖనిజాలను తవ్వుకోవడానికి అగ్రరాజ్యానికి అనుమతి ఇచ్చే అంశాలపై చర్చించేందుకు ట్రంప్‌తో జెలెన్‌స్కీ శుక్రవారం సమావేశం అయిన విషయం తెలిసిందే. అయితే చర్చల మధ్య ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో సమావేశం అర్థాంతరంగా ముగిసింది. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకుండానే ఉక్రెయిన్ అధ్యక్షుడు వైట్‌హౌస్‌ను వీడారు. 

ఉక్రెయిన్‌పై ట్రంప్ నింద

ఇరువురు నేతలు సమావేశమైన తర్వాత తొలి 30 నిమిషాల పాటు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లా డుతూ భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ట్రంప్‌ను కోరారు. ఇదే వివాదానికి దారి తీసింది. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు రష్యా ఉక్రె యిన్‌ల మధ్య యద్ధమే ప్రారంభమయ్యేది కాదని పేర్కొన్న ట్రంప్.. ఉక్రెయిన్ అనవసరంగా యుద్ధాన్ని మొదలు పెట్టిందంటూ ఆరోపించారు.

ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మీరు మద్దతు పలుకుతున్నారా? అని మీడియా ట్రంప్‌ను ప్రశ్నించగా అక్కడే ఉన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలగజేసుకున్నారు. దౌత్యం ద్వారానే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటుదని వాన్స్ వెల్లడించారు. దీంతో అసహనానికి గురైన జెలెన్‌స్కీ ‘పుతిన్ మా దేశంపై దాడి చేసి అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. మీకు తెలుసా? చాలా మందిని చంపారు. ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ, ఖైదీలను మార్చుకునే ఒప్పందాలు ఉన్నాయి.

కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు. మీరు ఏ దౌత్యం గురించి మాట్లాడుతున్నారు వాన్స్? దౌత్యానికి అర్థం ఏంటి? అని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి లోనైన వాన్స్.. ‘నేను మీ దేశంలో జరిగే విధ్వంసాన్ని అంతం చేసే దౌత్యం గురించి మాట్లాడుతున్నాను’ అని బదులిచ్చారు. అంతేకాకుండా మీడియా ముందు ఓవల్ ఆఫీస్‌లో ఇలా వాదించడాన్ని అగౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 

సోషల్ మీడియాలో ఇరువురు నేతల పోస్టులు

చర్చలు జరిగిన తీరుపై సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ పెట్టారు. శాంతి స్థాపనలో అమెరికా ప్రమేయాన్ని జెలెన్‌స్కీ కోరుకోవడం లేదని తాను నిర్ధారించుకున్నట్టు ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తనకు ఎటువంటి ప్రయోజనం అవసరం లేదని, కేవలం శాంతి స్థాపన జరగాలనే కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఓవల్ కార్యాలయంలో అమెరికాను జెలెన్‌స్కీ అవమానపరిచారని ఆరోపించారు.

అంతేకాకుండా శాంతి స్థాపన కోరుకున్నప్పుడు జెలెన్‌స్కీ తిరిగి చర్చలకు రావొచ్చని పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటుందని జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా శనివారం ప్రకటించారు. అమెరికా ప్రజలకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ట్రంప్ మద్దతు తమకు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఖనిజాలు తవ్వుకోవడంపై ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 

మీరు ఒంటరి కాదు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ప్రపంచ వ్యాప్తంగా పలువురు దేశాధ్యక్షులు, ప్రధానులు అం డగా నిలిచారు. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇతర దేశాలకు పిలుపునిచ్చారు. మీరు ఎప్పుడూ ఒంటరి కాదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురా లు ఉర్సులా వాన్ డెర్ లేయన్ జెలెన్‌స్కీని ఉద్దేశించి పేర్కొన్నారు. జర్మనీ ఛాన్స్‌లర్, ఇటలీ ప్రధాని, నార్వే ప్రధాని ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచారు. 

మూడవ ప్రపంచ యుద్ధంతో జూదం ఆడుతున్నారు

జెలెన్‌స్కీ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసి న ట్రంప్.. మాకు ఎదురయ్యే అనుభవాల గు రించి మీరు చెప్పొద్దు. మేము మీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామంటూ బదులిచ్చారు. మాకు సలహాలు ఇచ్చే స్థితిలో మీరు లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అ ంతేకాకుండా ‘మిలియన్ల ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ మూడో ప్రపంచ యు ద్ధంతో మీరు జూదం ఆడుతున్నారంటూ’ జె లెన్‌స్కీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోసారి కలగజేసుకున్న వాన్స్.. ‘మీకు చేస్తున్న సాయానికి కృతజ్ఞతగా అమెరికాకు ఒక్కసారై నా ధన్యవాదాలు తెలిపారా?’ అంటూ జెలెన్‌స్కీని ప్రశ్నించగా.. తాను ఎన్నోసార్లు  కృతజ్ఞ తలు చెప్పినట్టు పేర్కొన్నారు. మీటింగ్ సందర్భంగా మీరు ఒక్కసారి కూడా ధన్యవాదాలు తెలపలేదని వాన్స్ ఆరోపించారు.