23 July, 2026 | 5:23 PM

మైసూర్‌లో షూటింగ్ ప్రారంభం

23-11-2024 12:00 AM

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. దీనికి సంబంధించి డైరెక్టర్ బుచ్చిబాబు తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆయన శుక్రవారం ఉదయం మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని అక్కడి ప్రాంగణంలో దిగిన ఫోటోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఆయన చేతిలో స్క్రిప్ట్ పేపర్లున్నాయి. ఈరోజు బిగ్ డే అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

“ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు. మేము ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఇది ప్రారంభమైంది. మీ ఆశీస్సులు కూడా కావాలి” అని రాసుకొచ్చారు. మొత్తానికి షూటింగ్ ప్రారంభమైందని బుచ్చిబాబు చెప్పేశారు. ఇక ఆర్‌సీ 16 షూటింగ్ తొలి షెడ్యూల్ మైసూర్‌లోనే ప్రారంభం కానుందట. ఇక్కడ మూడు రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారట. తొలి షెడ్యూల్‌లో రామ్ చరణ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారని సమాచారం.