22 April, 2026 | 8:18 AM

పోర్న్ వీడియోలు చూపించి.. లైంగిక వేధింపులు

22-08-2024 12:11 AM

అకోలా, ఆగస్టు 22: తండ్రి స్థానంలో ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు కీచకుడి అవతారం ఎత్తాడు. విద్యార్థినులకు అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో వెలుగు చూసింది. ఎస్పీ బచ్చన్‌సింగ్ వివరాలు వెల్లడించారు. కాజీ ఖేడ్‌లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా ప్రమోద్ మనోహర్ సర్దార్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు.

కొన్నాళ్ల నుంచి ప్రమోద్ ఆరుగురు విద్యార్థులకు అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ, వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా డు. వేధింపులకు తాళలేని విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వారు మంగళవారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు రంగంలో కి దిగి బాధితుల నుంచి వాంగ్మూ లం తీసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు.