సీరియల్ కిల్లర్ పరార్
22-08-2024 12:12 AM
నైరోబీ, ఆగస్టు 21: ఆ సీరియల్ కిల్లర్ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 42 మందిని హతమార్చా డు. ముప్పుతిప్పలు పడి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసకున్నారు. ఊహించని రీతిలో నిందితు డు పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పోలీసులకు షాక్ ఇచ్చాడు. ఆ కరుడుగట్టిన సీరియల్ కిల్లర్ పేరే కొలిన్స్ జుమైసీ ఖాలుశా..! కెన్యా రాజధాని నైరోబీతో పాటు పరిసర ప్రాంతాల్లో రెండేళ్ల నుంచి వరుసగా మహిళలు అదృశ్యమైన నిందితుడు 42 మంది మహిళలను లొంగదీసుకుని, తర్వాత వారిని హతమార్చి, మృతదేహాలను ఛిద్రం చేసి డంపింగ్ యార్డులో వదిలేసేవాడు. వరుస హత్యలకు కారణం కొలిన్స్ జుమైసీ ఖాలుశా అని గుర్తించి జూలైలో నిం దితుడిని అదుపులోకి తీసుకున్నారు.






