ఆదివాసీ మహిళపై సామూహిక అత్యాచారం
22-08-2024 12:09 AM
రాయ్‌పూర్, ఆగస్టు 21: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆదివాసీ మహిళను అటకాయించి ఆరుగురు వ్యక్తులు సామూ హిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం ఘటన చోటుచేసుకోగా బాధితురాలి ఫిర్యాదుతో బుధవారం వెలుగు చూసింది. రక్షాబంధన్ సందర్భంగా ఆదివాసీ మహిళ పుసౌర్ జాతరకు వచ్చింది. ఆమెను ఆరుగురు వ్యక్తులు అపహరించి బలవం తంగా జాతర పక్కనే ఉన్న చెరువు ఒడ్డుకు ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నా రు. మహిళపై లైంగికాడిపై మాజీ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. ‘బాధితురాలికి రాష్ట్రప్రభుత్వం అండ గా నిలిచి రక్షణ కల్పించాలి. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి’ అని ‘ఎక్స్’ ద్వారా సూచించారు.






