శ్రీ చరణి అరుదైన రికార్డు

12-09-2026 | 05:20am

దుబాయి, సెప్టెంబర్ 11: మహిళల టీ20 క్రికెట్‌(Women's T20 cricket)లో తెలుగు తేజం శ్రీ చరణి(Shree Charani) చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్‌లో  ఒక వికెట్ తీయడం ద్వారా అంతర్జాతీయ టీ20లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును శ్రీ చరణి అధిగమించింది.

బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవ ర్లు వేసిన ఈ కడప బిడ్డ 14 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. ఇది శ్రీ చరణికి 50వ వికెట్ కాగా.. 29 మ్యాచ్‌లోనే ఆమె ఈ మైలురాయిని అందుకుంది. తద్వా రా కుల్దీప్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. 2023లో కుల్దీప్ యాదవ్ 30 మ్యాచ్‌లో 50 వికెట్ల మైలురాయి అం దు టకున్నాడు. దీంతో భారత పురుష, మహిళా క్రికెటర్లలో కలిపి అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా శ్రీ చరణి అరుదైన ఘనతను సాధించింది.

వరుణ్ చక్రవర్తి (32 మ్యాచ్‌లు), అర్షీదీప్ సింగ్ (33 మ్యాచ్‌లు), రాధా యాదవ్ (35 మ్యాచ్‌లు) అత్యంత వేగంగా 50 వికెట్ల ఘనతను అందుకున్న జాబితాలో కొనసాగుతున్నారు. అయితే ఓవరాల్‌గా మహిళా క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా శ్రీ చరణి నిలిచింది. 50 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో భారత పిన్న వయస్కురాలిగా కూడా శ్రీ చరణి నిలిచింది. 22 ఏళ్ల 37 రోజుల వయసులో శ్రీచరణి ఈ ఘనతను అందుకుంది.

మరిన్ని వార్తలు