17 April, 2026 | 8:33 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

రాజన్న సేవలో సిద్ధార్థ్ ఎస్జే..

07-06-2025 08:19 PM

ప్రియాంక వర్మ భూపతి రాజు దంపతులు..

వేములవాడ (విజయక్రాంతి): శనివారం నాంది, ఉగ్రం సినిమాల డిఓపి (Direction of Photography) సిద్ధార్థ్ ఎస్ జే - ప్రియాంక వర్మ భూపతి రాజు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అర్చకులు మామిడిపెల్లి శరత్ కుమార్ నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందని, స్వామివారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామం తన సొంత ప్రాంతమని వెల్లడించారు.