17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గోశాలలో అనారోగ్యంతో రెండు కోడెలు మృత్యువాత

07-06-2025 08:24 PM

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి..

సిరిసిల్ల (విజయక్రాంతి): తిప్పాపూర్ లోనీ గోశాలలో అనారోగ్యంతో ఉన్న కోడెలలో శనివారం రెండు కోడెలు మృతి చెందినట్లు, మిగిలిన వాటికి వెటర్నరీ వైద్యులు అందించే చికిత్సకు స్పందిస్తున్నాయని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోశాలలో ఉన్న 1300 పశువులలో ప్రస్తుతం మొత్తం 14 కోడెలకు వెటర్నరీ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లు, వైద్యానికి పది కోడేలు స్పందిస్తు, అనారోగ్యం నుండి కోలుకుంటున్నట్లు, మరో రేండు కోడేలు ఆరోగ్య పరిస్థితి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నట్లు, కొత్తగా ఏవీ కూడా అనారోగ్యమునకు గురికాలేదని తెలిపారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పశుసంవర్ధక  శాఖ అధికారి ఆపకుండా పేర్కొన్నారు.