30 May, 2026 | 2:36 AM

సిగ్మా వచ్చేది అప్పుడే

30-05-2026 01:14 AM

సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న చి త్రం ‘సిగ్మా’. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాతో జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రకటించినప్పట్నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.

టీజర్‌కు కూడా మంచి స్పందన దక్కింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యా ప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.